Amaravati: ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం

Jagan Govt Decides to Lease Group-D Buildings In Amaravati
x

Amaravati: ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం

Highlights

Group-D Buildings Lease: ఏపీ సర్కారు ఆదాయమార్గాల కోసం కొత్తబాటలు పడుతోంది.

Group-D Buildings Lease: ఏపీ సర్కారు ఆదాయమార్గాల కోసం కొత్తబాటలు పడుతోంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ఏపీ సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందుకోసం రాజధానిలో గ్రూప్‌-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇవ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం తెలిపినట్టు సమాచారం.

ఇందులోని ఒక భవనాన్ని విట్‌ యూనివర్సిటీకి లీజుకు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. లీజు ద్వారా ఏడాదికి 8 నుంచి 10కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఒక టవర్‌లోని 120 ఫ్లాట్‌లను లీజుకు ఇచ్చి ఆదాయం ఆర్జించాలని సీఆర్డీఏ భావిస్తోంది. ఆ తరువాత ఐదు టవర్లను కూడా లీజుకు ఇచ్చే కసరత్తు జరుగుతోంది. గ్రూప్‌-డి ఉద్యోగుల కోసం గతంలో ఆరు రెసిడెన్షియల్‌ టవర్లను నిర్మించారు. మొత్తం ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల్లో ఒక దానిని లీజుకు తీసుకునేందుకు విట్‌ యూనివర్సిటీ కూడా ముందుకు వచ్చింది. ఈ భవనాలను లీజుకిచ్చేందుకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories