YS Jagan: అధికారం దక్కలేదని కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారు

*అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారు -జగన్‌ *సీఎంను దారుణమైన అసభ్య పదజాలంతో తిడుతున్నారు -జగన్‌

Shilpa
Published on: 21 Oct 2021 9:44 AM IST
Jagan Criticized the TDP on Destroying Idols and Chariots in Andhra Pradesh
X

సీఎం జగన్(ఫైల్ ఫోటో)

YS Jagan: అధికారం దక్కలేదన్న అక్కసుతో విగ్రహాలు, రథాలు నాశనం చేస్తున్నారని టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం జగన్. అధికారం దక్కలేదని కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ‎అధికారం దక్కలేదని ఇళ్ళ నిర్మాణం ఆపడానికి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారన్నారు. ఒక్క సీఎంను పట్టుకొని బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్‌ అని, ఇలా తిట్టినందుకు సీఎంను అభిమానించేవారు గొడవలు చేయాలని కోరుకోవడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. తమకు గిట్టని మనిషి సీఎంగా ఉన్నారని రాష్ట్రం పరువు, ప్రతిష్టలు దిగజారుస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్.

Shilpa

Shilpa

Next Story