పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులకు సీఎం జగన్‌ అభినందనలు

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

Dhatripriya
Updated on: 7 March 2023 2:26 PM IST
Jagan Congratulated The Officals And Ministers Of The Industries Department
X

పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులకు సీఎం జగన్‌ అభినందనలు

YS Jagan: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. విశాఖలో ఈ నెల 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. రెండు రోజుల్లో 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు జరిగాయి. దీంతో 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సీఎం కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం జగన్ సూచించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, గుడివాడ అమర్‌నాథ్‌, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డాక్టర్ జి. సృజన, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ S షన్‌మోహన్‌ పాల్గొన్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story