Andhra Pradesh: తిరుపతిలో జగన్, చంద్రబాబు పోటాపోటీ ప్రచారం

Andhra Pradesh: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరుతోంది.

Arun Chilukuri
Published on: 7 April 2021 5:01 PM IST
Jagan​ Chandrababu​ to Campaign for Tirupati BY Election
X

Andhra Pradesh: తిరుపతిలో జగన్, చంద్రబాబు పోటాపోటీ ప్రచారం

Andhra Pradesh: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. ఒకేరోజు తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇద్దరు అధినేతల రాకతో తిరుపతి ప్రచారం మరింత వేడెక్కనుంది. ఈనెల 14న సీఎం జగన్ తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా అదేరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రచారం కూడా కన్ఫర్మ్ అయింది. దీంతో రెండు పార్టీల అధినేతల సభలను సక్సెస్ చేసేందుకు పార్టీల నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం రేపు సాయంత్రం శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే 9వ తేదీ నెల్లూరు జిల్లా సర్వేపల్లి, 10న సూళ్లూరుపేట, 11న వెంకటగిరి, 12 సత్యవేడు, 13న గూడూరులో ప్రచారం నిర్వహించనున్న చంద్రబాబు 14న తిరుపతి సభలో ప్రసంగించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story