2009లో జూనియర్ ఎన్టీఆరే మాకు టికెట్లు ఇప్పించారు : కొడాలి నాని

2009లో జూనియర్ ఎన్టీఆరే మాకు టికెట్లు ఇప్పించారు : కొడాలి నాని
x
కొడాలి నాని
Highlights

చంద్రబాబులాగా తాను జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేయాలంటూ చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు...

చంద్రబాబులాగా తాను జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేయాలంటూ చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు.

తనకు, వల్లభనేని వంశీకి టికెట్లు ఇప్పించడానికి చంద్రబాబుతో ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేశాడని అన్నారు. ఆనాడు టికెట్లు ఇప్పించినందుకు ఇప్పటికీ తాము ఎన్టీఆర్ కుటుంబానికి కృతజ్ఞతతో ఉన్నామన్నారు. అయితే, లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారన్న కొడాలి నాని ఎన్టీఆర్ పేరు చెప్పకుండా ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకి ఉందా అంటూ సవాలు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories