Vizag: విశాఖలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Vizag: ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు

Dhatripriya
Published on: 25 May 2023 9:47 AM IST
IT Raids Are Ongoing In Visakhapatnam
X

Vizag: విశాఖలో కొనసాగుతున్న ఐటీ సోదాలు 

Vizag: విశాఖలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. D3 ప్రైమ్, హైగ్రో కెమికల్స్, విజయ శ్రీ ఆర్గానిక్స్ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 10 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో 15 ఐటీ బృందాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 గంటల నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

సబ్సిడీపై తీసుకున్న మందులు, ముడిసరుకులు చేతులు మారుతున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదాయానికి సంబంధించిన అనేక వివరాలను కూపీ లాగుతున్నారు. D3 ప్రైమ్, హైగ్రో కెమికల్స్, విజయ శ్రీ ఆర్గానిక్స్ కంపెనీల ఆఫీసులు, డైరెక్టర్ల ఇళ్లలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story