మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ నోటీసులు

* కర్నూలు జిల్లా ఆస్పరిలో 30.83 ఎకరాలు కొనుగోలు చేసిన రేణుకమ్మ.. భూముల కొనుగోలు లావాదేవీలపై నోటీసులు పంపిన ఐటీ శాఖ

R Tripura Malini
Published on: 1 Dec 2022 11:59 AM IST
IT Notices To Minister Gummanuru Jayaram Wife
X

మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ నోటీసులు

AP Minister: మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ అధికారులు నోటీసులు పంపారు. బినామీ యాక్ట్ కింద రేణుకమ్మకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇటీవల కర్నూలు జిల్లా ఆస్పరిలో 30.83 ఎకరాలను రేణుకమ్మ కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు లావాదేవీలపై నోటీసులు పంపిన ఐటీ 52 లక్షల42 వేల రూపాయల భూ కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదంటూ నోటీసులు పంపారు. నోటీసులో పలు కీలక అంశాలను ప్రస్తావించిన ఐటీ ఒకే రోజు మంత్రి భార్య బంధువుల పేర్లతో 15 ఎకరాల భూమి రిజిస్టర్ చేసినట్టు నోటీసులో పేర్కొన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story