నేడే నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ-48

నేడే నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ-48
x
రిశాట్‌ – ఈబీఆర్‌1
Highlights

వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న ఇస్రో మరో మైలురాయిని అందుకోనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ ప్రయోగానికి సన్నాహాలు...

వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న ఇస్రో మరో మైలురాయిని అందుకోనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ ప్రయోగానికి సన్నాహాలు పూర్తి చేసింది. నిన్న మధ్యాహ్నం ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభమైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకు రిశాట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒకటో లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని నింగిలోకి పంపించనున్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపట్టనున్నారు. రాకెట్​అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఇప్పటికే పీఎస్ ఎల్వీ సీ 47 ప్రయోగం సక్సెస్ కావడంతో మంచి ఊపుమీదున్న ఇస్రో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రయోగం చేపడుతోంది శ్రీహరికోట సతీష్​దావన్​స్పేస్​సెంటర్​నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరనుంది.

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒకటో లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని నింగిలోకి పంపించనున్నారు. స్వామివారి పాదాల వద్ద నమూనా పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో హాఫ్ సెంచరీ ఇస్రో తురుపుముక్క పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇది 50వది. ఇప్పటిదాకా 49 పీఎస్ఎల్వీలను అంతరిక్షంలోకి పంపించింది ఇస్రో.

ఇప్పటికే రాకెట్ ప్రయానికి సంబంధించి కౌంట్‌ డౌన్ మొదలైంది. 23 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ అనంతరం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ సీ 47 రాకెట్ విజయవంతంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు RISAT-2BR1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సిద్ధమయ్యారు. పీఎస్ఎల్వి-సి 48 రాకెట్ షార్ నుండి ప్రయోగిస్తున్న 75 వ ఉపగ్రహ ప్రయోగ నౌక పీఎస్ ఎల్వి రాకెట్ లలో ఇది 50వది మొదటి ప్రయోగ వేదిక నుండి 37వ ప్రయోగం నాలుగు స్ట్రపాన్ బూస్టర్లతో దీనిని నిర్మించారు. సరిహద్దుల్లోని నిఘాను మరింత పెంచేందుకు ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది ఇస్రో.

రిశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే పీఎస్ఎల్వీ 50వ ప్రయోగం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్కంఠత నెలకొంది. మొత్తం 628 కేజీల బరువు ఉన్న వివిధ పేలోడ్లను పీఎస్ఎల్వీ అంతరిక్షంలోకి మెసుకెళ్లబోతోంది. తొమ్మిది విదేశీ పేలోడ్స్ ఉన్నాయి. ఇందులో మొదటి సాటిలైట్ RISAT-2B ను ఈ ఏడాది మే 22న కక్షకు చేర్చింది. RISAT-2BR1 రెండవ ఉపగ్రహం కాగా ,మూడవ ఉపగ్రహంగా RISAT-2BR2 ను కూడా ఈ నెల రెండవ సగంలోనే కక్షలోకి చేర్చేందుకు ఇస్రో ప్లాన్ చేసింది. రిశాట్-2బీఆర్1 సిరీస్‌లో కనీసం 4 ఉపగ్రహాలను నింగిలోకి పంపితే చాలు. మన సరిహద్దులోని టెర్రరిస్టులకు చెక్‌ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మ‌రి మ‌నం కూడా ఇస్రో శాస్ర్తవేత్తల‌కు ఆల్ ది బెస్ట్ చెబుదాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories