టీడీపీ మహానాడుకు వైసీపీ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోందా?

TDP Mahanadu: 2024 ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మహానాడుకు సిద్ధమవుతోంది.

Arun Chilukuri
Updated on: 25 May 2022 7:16 PM IST
Is YCP Government Creating Obstacles for TDP Mahanadu?
X

టీడీపీ మహానాడుకు వైసీపీ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోందా?

TDP Mahanadu: 2024 ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మహానాడుకు సిద్ధమవుతోంది. రెండేళ్లకోసారి నిర్వహించే పసుపు పండుగ సవ్యంగా సాగుతుందా లేదా అనే డౌట్ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. కారణం అధికార వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందనే ఆరోపణ చేస్తోంది తెలుగుదేశం. ఆంక్షల నడుమ మహానాడు నిర్వహించుకోవాల్సి వస్తుందనేది తెలుగుదేశం విమర్శ. సభ కోసం స్థలం ఇవ్వక పోవడం, ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇవ్వకపోవడం, ప్రైవేట్ వాహనాలను అనధికారికంగా అజమాయిషీ చేస్తూ అధికార వైసీపీ అడ్డంకులు పెడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అడ్డంకులు ఎన్ని వచ్చినా అసలుసిసలు తెలుగు పండుగ మహానాడును గ్రాండ్‌గా చేస్తామంటోంది టీడీపీ సైన్యం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story