జగన్‌ను టార్గెట్‌ చేయబోయి పవనే ఇరుక్కున్నారా?

జగన్‌ను టార్గెట్‌ చేయబోయి పవనే ఇరుక్కున్నారా?
x
Highlights

పవన్ కల్యాణ్‌ ఏదో అనబోయి మరేదో అనేశారా...మతపరంగా జగన్‌ను టార్గెట్‌ చేయబోయి, తానే ఇరకాటంలో పడ్డారా మతరాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నాయకులేనన్న మాటలపై,...

పవన్ కల్యాణ్‌ ఏదో అనబోయి మరేదో అనేశారా...మతపరంగా జగన్‌ను టార్గెట్‌ చేయబోయి, తానే ఇరకాటంలో పడ్డారా మతరాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నాయకులేనన్న మాటలపై, బీజేపీ నేతలు ఓ రేంజ్‌లో పవన్‌ మీద ఫైరవడం దేనికి సంకేతం జగన్‌ను లక్ష్యంగా చేసుకున్న విమర్శలు, కమలనాథులకు తగలడం మిస్‌ ఫైరా లేదంటే గురి చూసే కాషాయంపై పవన్‌ కత్తి దూశారా ఏపీలో పవన్‌ మాటలు ఎలాంటి ప్రకంపనలు రేపుతున్నాయి జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని పవన్‌ విసురుతున్న ఆరోపణాలుస్త్రాలు, ఎలాంటి రాజకీయాలను తలపిస్తున్నాయి?

ఏపీలో కలకలం రేపుతున్న పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలు

జనసేన అధినేతపై బీజేపీ, హిందూ సంఘాల ఆగ్రహం

జగన్‌ను టార్గెట్‌ చేయబోయి పవనే ఇరుక్కున్నారా?

ఇక పవన్‌పై కమలం రణమేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈమధ్య చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో పెద్దగా వినపడని మతం గురించిన చర్చలు, పవన్ కామెంట్ల కారణంగా జరుగుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికలైన తర్వాత, కొన్నాళ్లు జగన్ ప్రభుత్వంపై విధానపరమైన విమర్శలు చేసిన పవన్, ఈమధ్య జగన్‌ కులం, మతం గురించి కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. అసలు జగన్ ‌కులం, మతం గురించి పవన్‌ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు. వరుసగా మతం గురించి కామెంట్ల ఉద్దేశమేంటి దీని వెనక పవన్‌కు ఒక అజెండా వుందా అన్న చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి.

సీఎం జగన్‌ను మతపరంగా పవన్‌ టార్గెట్ చేశారన్నది స్పష్టమవుతోంది. అయితే జగన్‌ను మతపరంగా టార్గెట్ చేసే క్రమంలో, పవన్ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు, ఆయనకే బూమరాంగ్ అయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పమయ్యాయి. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని, ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మతం విషయంలో సీఎం జగన్‌పై టార్గెట్ చేయాలనుకున్న పవన్ కల్యాణ్, అటుఇటూ తిరిగి హిందూమతంపై ప్రసంగాన్ని మళ్లించారన్న చర్చ జరుగుతోంది. ఏదో అనబోయి, ఏదో అర్థమయ్యేలా చెప్పబోయి పవన్ ఇలా అన్నారా...లేదంటే మనసులో వున్నదే మాట్లాడారా అన్నది ఎవరికీ అర్థంకావడం లేదు. చివరికి జనసేన నాయకులకు కూడా పవన్ వ్యాఖ్యలను ఎలా సమర్థించాలో కూడా బోధపడ్డంలేదట. అయితే, పవన్ చేసిన కామెంట్లు మాత్రం కాషాయ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆరెస్సెస్, వీహెచ్‌పీ, బీజేపీ నేతలు వరుసగా పవన్‌‌పై విమర్శలదాడి మొదలుపెట్టారు. హిందూధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన పవన్‌పై, నిరసన వ్యక్తం చేశారు. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

మత రాజకీయాలపై పవన్ వ్యాఖ్యలు వ్యూహాత్మకమా...యథాలాపమా?

బీజేపీని ఉద్దేశించే ఇలాంటి కామెంట్లు చేశారా?

జగన్‌ను టార్గెట్ చేసే క్రమంలో ఈ వ్యాఖ్యలు సంధించారా?

లేదంటే కమలంపై కసితోనే కామెంట్లు చేశారా?

పవన్‌ మాటల వెనక అంతుబట్టని అంతరార్థమేంటి?

బీజేపీకి ఎందుకు టార్గెట్‌గా మారుతున్నారు?

పవన్ టార్గెట్ జగనా, బీజేపీనా అన్నది ప్రస్తుతానికైతే ఎవరికీ బోధపడ్డం లేదు. కానీ పవన్‌పై వరుసగా బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండటంతో, అనుకోకుండా బీజేపీకి-జనసేనకు వైరం పడినట్టయ్యింది. కానీ పవన్ టార్గెట్ మొత్తం జగనేనని, ఆ మాటలు అనేక్రమంలో హిందూ మతాన్ని హిందూ రాజకీయ నాయకులే భ్రష్టుపట్టిస్తున్నారన్న కామెంట్లు చేశారని, కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియం సందర్భంలో పవన్ మూడు పెళ్లిళ్ల గురించి, సీఎం జగన్ ప్రస్తావించడంతో, పవన్ తీవ్రంగా హర్ట్‌ అయ్యారని, అప్పటి నుంచి జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్న మాటలు వినపడుతున్నాయి. మరోవైపు జగన్‌ను మతపరంగా టార్గెట్ చేసి, బీజేపీ అధినాయకులను మెప్పించాలనుకున్నారని, చివరికి ఆ మాటలు కాస్తా హిందూ రాజకీయ నాయకులపై మళ్లి, అవే రివర్స్ అయ్యాయన్న వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి. మొత్తానికి కులం, మతంపై పవన్ చేస్తున్న వరుస వివాదాస్పద వ్యాఖ్యలు అజెండాలో భాగమా...లేదంటే యథాలాపంగా పాసింగ్‌ కామెంట్‌లా ఫ్లోలో అన్నారా అన్నది, జనసేన అధినేతకే తెలియాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories