పాపం కాకినాడ మేయర్‌.. సుంకర పావనిపై ఎందుకంత సింపతీ?

పాపం కాకినాడ మేయర్‌.. సుంకర పావనిపై ఎందుకంత సింపతీ?
x
Highlights

పాపం. అయ్యో పాపం. ఆ మేయర్‌కే అన్ని కష్టాలు రావాలా? సమస్యలన్నీ చుట్టాల్లా, ఆమెనే చుట్టుముట్టాలా? సొంత పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆమెకు సంతోషం లేదు...

పాపం. అయ్యో పాపం. ఆ మేయర్‌కే అన్ని కష్టాలు రావాలా? సమస్యలన్నీ చుట్టాల్లా, ఆమెనే చుట్టుముట్టాలా? సొంత పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆమెకు సంతోషం లేదు ఇప్పుడు కష్టాలు కాస్త, పదిరెట్లు పెరిగాయట ఆ మహిళా మేయర్‌కు. ప్రత్యర్థివర్గం నుంచే కాదు, స్వపక్షం నుంచే ఆమెకు, కోల్డ్‌వార్‌ తీవ్రమైందట. అందుకే న్యాయం చెయ్యాలంటూ, చివరికి కోర్టు మెట్లెక్కారట. కష్టాలకే కష్టాల్లా కనిపిస్తూ, చుక్కలు చూస్తున్న ఆ నగర ప్రథమ పౌరురాలు ఎవరు?

ఈమె సుంకర పావనీ తెలుగుదేశం మహిళా నాయకురాలు కాకినాడ నగర మేయర్. ఏ ముహూర్తాన కాకినాడ మేయర్ పగ్గాలు చేపట్టారో గానీ, అప్పటి నుంచి ఆమెకు నిత్యం తలనొప్పులే. అప్పుడేమో సొంత పార్టీ కార్పొరేటర్లే తిరుగుబాటు ధోరణితో విసిగించగా, ఇప్పుడు వారికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం తోడయ్యారట. ఏ పనీ చెయ్యలేక, అధికారులతో పనులు చేయించలేక సతమతమైపోతున్నానంటున్నారు సుంకర పావనీ.

రాష్ట్ర రాజకీయాలను ఆకర్షించిన కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగి, దాదాపు మూడేళ్లు పూర్తయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు కేవలం 20 నెలల ముందు నిర్వహించిన ఎన్నికలు కావడంతో, అప్పట్లో ఇరుపార్టీలూ ఆ ఎలక్షన్స్‌ను రెఫరెండంగానే భావించాయి. అప్పటి ప్రతిపక్ష వైసిపికి, అధికార తెలుగుదేశానికి, టగ్ ఆఫ్ వార్‌గా జరిగిన ఎన్నికల్లో, అంచనాలను తారుమారు చేస్తూ నాలుగింటా మూడొంతుల మెజారిటీని కైవసం చేసుకుంది టిడిపి. 50 స్థానాలకు, రెండు డివిజన్లలో కోర్టు అభ్యంతరాలతో, 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా అప్పట్లో బిజేపితో కలసి టిడిపి ఎన్నికల్లో పోటీ చేసి.. 38 స్ధానాలను కైవసం చేసుకుంది. అయితే ముందు నుంచి మేయర్ ఎన్నికపై స్ధానిక నాయకులదే పెత్తనం అయినప్పటికీ, అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్, మేయర్‌ను డిసైడ్ చేసింది. జిల్లా పార్టీ పెద్దల అండా, పార్టీ అధీష్టానం ఆశీర్వాదంతో కాపు సామాజిక వర్గానికి చెందిన సుంకర పావనీని మేయర్ గా ప్రకటించింది తెలుగుదేశం. అప్పట్లో ఆమెను మేయర్‌గా ప్రకటించడాన్ని కొందరు వ్యతిరేకించినా పార్టీ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేకపోయారు. కాదన్న వారు టిడిపిని వీడారు. టిడిపిలో ఉన్నా ఆమెకు దూరంగా ఉంటూ వచ్చారు మరి కొందరు కార్పొరేటర్లు.

సొంత పార్టీ అధికారంలో ఉండగా, ఒకింత ఇబ్బంది పడిన మేయర్ సుంకర పావని, ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే పరిస్ధితుల్లో ఉన్నారట. ఏ చిన్న అవసరమొచ్చినా అధికారులను ఒకటికి రెండుసార్లు అడిగితే గానీ, స్పందించడంలేదని ఆమె వ్యక్తం చేస్తున్న ఆవేదన, స్మార్ట్ సిటి కాకినాడలో హాట్ టాపిక్‌గా మారింది. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేటప్పుడు మినహా, ఆమెకు మేయర్ అనే గుర్తింపే లేకుండా పోయిందన్న చర్చ జోరుగా సాగుతోంది. కాకినాడ నగర ప్రథమ పౌరురాలికి ఉండాల్సిన ప్రోటోకాల్ ఎక్కడా, ఈ ప్రభుత్వంలో పాటించడం లేదని పావని అనుచరులు నిరుత్సాహంగా ఉంటున్నారట. అందుకు ఎన్నో నిదర్శనాలున్నాయని తెగ ఫీలయిపోతున్నారట మేయర్ ఫాలోవర్స్.

వైసిపి అధికారం చేపట్టగానే కౌన్సిల్ హాల్ కు అనుసంధానంగా ఉన్న మేయర్ చాంబర్‌ను అక్కడి నుంచి దూరంగా మార్చివేసారట. అంతేకాకుండా ఆమె మారు మాట్లాడకుండా ఉండేందుకు, మహిళా కార్పొరేటర్లకు వెయిటింగ్ హాల్‌గా ఆ చాంబర్‌ను మార్చారట. అయితే మేయర్ చాంబర్‌కు అనుసంధానంగా యాంటీ రూమ్, అంటే అంతరంగిక గది, కేటాయించాల్సి ఉండగా, అది ఇప్పటి వరకూ నిర్మించలేదట. ఎక్స్ అఫిషియో సభ్యులకు సైతం కార్పోరేషన్ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్‌ను నిర్మించిన అధికారులు, తనకు మాత్రం యాంటీ రూమ్ నిర్మించకపోవడం పట్ల గుర్రుగా ఉన్నారట మేయర్ పావనీ.

తన చాంబర్‌కు అనుసంధానంగా యాంటీ రూమ్ నిర్మించాలని అధికారులను పలుమార్లు కోరినా, ఏ మాత్రం స్పందించడం లేదట. దీంతో కాకినాడ మేయర్ సుంకర పావని న్యాయస్ధానాన్ని ఆశ్రయించారట. అయితే ఇదంతా కావాలని చేస్తున్న రాద్దాంతమని వైసిపి నాయకులు కొట్టిపారేస్తుంటే, సొంత పార్టీ నేతలే ఇప్పడు యాంటీ రూమ్ నిర్మాణానికి మోకాలడ్డుతున్నారట. తమకు కేటాయించిన కార్యాలయాన్ని మేయర్ యాంటీ రూమ్‌లా మార్చడాన్ని, టిడిపి కార్పొరేటర్లే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. దీంతో సొంతపార్టీతో పాటు, వైసీపీ నుంచీ ఎదురవుతున్న ప్రతీకూల పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నారట మేయర్ పావనీ.


Show Full Article
Print Article
Next Story
More Stories