ఏపీ బీజేపీలో ముసలం మొదలైందా...?

ఏపీ బీజేపీలో ముసలం మొదలైందా...?
x
Highlights

ఏపీ బీజేపీలో ముసలం మొదలైందా...? అంటే అవుననే అనిపిస్తుంది. తాజాగా ప్రకటించిన రాష్ర్ట కమిటీ ఆదిపత్య పోరుకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికలే...

ఏపీ బీజేపీలో ముసలం మొదలైందా...? అంటే అవుననే అనిపిస్తుంది. తాజాగా ప్రకటించిన రాష్ర్ట కమిటీ ఆదిపత్య పోరుకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికలే టార్గెట్ గా ముందుకు పోతున్న బీజేపీ ఆశలకు అదిపత్య పోరు ఎటు దారితీస్తుందో అన్నది పార్టీలో చర్చకు దారి తీసింది. బీజేపీ కొత్త అధ్యక్షుడు రాకతో నేతల మధ్య అసంతృప్తి మొదలయ్యిందా రాష్ర్ట బీజేపీలో ఏం జరుగుతుంది.? బీజేపీలో అంతర్మథనం కొనసాగతోంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం తర్వాత విభేదాలు బయటపడుతున్నాయి. నూతన కమిటీలో పాత అధ్యక్షుడు అనుచరులు ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పటి నుంచే పార్టీలో అంతర్మథనం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత టీవీ డిబెట్ లో కోసం మరో సెల్ ప్రకటించారు. అయినా అంతా కొత్త వారే ఉండటం పాత వారు ఎవరూ లేకపోవడంతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.

పార్టీలో మాజీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుచరులతో పాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని పక్కన పెట్టి కొత్త టీంను తెరపైకి తీసుకు వచ్చారని చెప్పుకుంటున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో పని చేస్తున్న సీనియర్ లీడర్స్ ను కాదని కొత్తవారితో టీం ఏర్పాటు చేయడం ఏంటని బహిరంగంగానే నేతలు విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన తమను కన్నా వర్గం టీడీపీ వర్గం అంటూ పక్కకు పెట్టడం ఏంటని పలువురు లోలోన మదనపడుతున్నారు. కొత్తగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు ఎవరినీ సంప్రదించకుండా కొత్త లిస్టును ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయామని వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయిందని మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వారితో పాటు పార్టీని నమ్ముకున్న రమేష్ నాయుడు వంటి వారిని సైతం మీడియా ప్యానల్ లిస్టులో లేకపోవడం సోము వీర్రాజు ఇచ్చిన ట్విస్ట్ అని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ లంకా దినకర్ వంటి వాళ్లను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీనే నమ్ముకుని అధిష్టానం ఎలాంటి పిలుపునిచ్చినా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న దిగువ శ్రేణి కార్యకర్తలు పార్టీ అంతర్గతంగా మొదలైన ముసలం ఎటు దారితీస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. అందరికి సముచిత ప్రాధాన్యత కల్పించి పార్టీ బలోపేతానికి సహకరించాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories