CM Jagan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

CM Jagan: ఈ నెల 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Shekhar G
Published on: 13 Sept 2023 10:08 AM IST
Invitation To CM Jagan For Tirumala Srivari Brahmotsavam
X

CM Jagan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

CM Jagan: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌ను ఆహ్వానించారు దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం సీఎం జగన్‌ను టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం అందించారు. కాగా ఈ నెల 18 నుంచి 26 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story