International Girl Child Day 2020 : ఒక్కరోజు కలెక్టర్ గా ఇంటర్ విద్యార్థిని!

International Girl Child Day 2020 : ఒక్కరోజు కలెక్టర్ గా ఇంటర్ విద్యార్థిని!
x
Highlights

International Girl Child Day 2020 : నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తన సీట్లో ఓ ఇంటర్ విద్యార్థినిని కూర్చోబెట్టి ఓ వినూత్న కార్యకమానికి శ్రీకారం చుట్టారు.

International Girl Child Day 2020 : నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తన సీట్లో ఓ ఇంటర్ విద్యార్థినిని కూర్చోబెట్టి ఓ వినూత్న కార్యకమానికి శ్రీకారం చుట్టారు. దీనితో సదరు కలెక్టర్ బాలికల పట్ల తనకున్నా గౌరవాన్ని చాటుకున్నారు. 'బాలికే భవిష్యత్' అనే పేరుతో గంధం చంద్రుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, అందులో భాగంగా అనంతపురం జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఈయర్ చదువుతున్న ఎం శ్రావణి అనే బాలిక నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ గా కొనసాగనుంది.

అటు కలెక్టర్ బాటలోనే మండల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు కూడా బాలికలకు తమ బాధ్యతలను అప్పగించి బాలికల పట్ల తమకున్నా గౌరవాన్ని చాటుకున్నారు. అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆదేశాలు ఇచ్చిన సరే వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు నిన్ననే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఈ తరహా కార్యక్రమాన్ని అమలు చేయడం దేశంలోనే మొదటిసారి కావడం విశేషం. ఇక చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కుర్చోగా గంధం చంద్రుడు ఆమె పక్కన నిలుచొని చేతులు కట్టుకుని నవ్వుతూ కనిపించారు.

ఇక అటు జాయింట్ కలెక్టర్‌గా ఏడవ తరగతికి చదువుతున్న సహస్ర అనే విద్యార్ధి ఎంపికైంది.. ప్రసాద్ స్కూల్లో సహస్ర చదువుతుంది. ఐదవ తరగతి చదువుతున్న నేత్రశ్రీ DROగా ఒక రోజు బాధ్యతలు నిర్వహిస్తోంది. కలెక్టరేట్ ఏవో గా 8వ తరగతి చదువుతున్న సమీర ఒక రోజు బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ గంధం చంద్రుడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories