Palnadu: వైసీపీలో వర్గపోరు.. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య విభేదాలు

Palnadu: ఎమ్మెల్సీ వర్గీయులపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే అనుచరులు

Shekhar G
Updated on: 4 Feb 2024 1:45 PM IST
Internal Differences Between MLA Kasu Mahesh Reddy and MLC Janga Krishnamurthy
X

Palnadu: వైసీపీలో వర్గపోరు.. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య విభేదాలు

Palnadu: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నారు. దాచేపల్లి మండలంలోని గామలపాడులో వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమానికి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ వైసీపీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఫోటోలు లేకపోవడంతో ఎమ్మె్ల్సీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాత్రికి రాత్రే ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ఎమ్మెల్సీ వర్గీయులు తొలగించారు. ఎమ్మెల్సీ వర్గీయులపై ఎమ్మెల్యే అనుచరులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువురు నేతల ఘర్షణ వాతావరణం నేపథ్యంలో పోలీసులు భద్రతను భారీగా మోహరించారు.

Shekhar G

Shekhar G

Next Story