తాడికొండలో ఉద్రిక్తత.. ఎమ్యెల్యే శ్రీదేవి వర్గం- డొక్కా వర్గం పోటాపోటీ నిరసనలు

Tadikonda: గుంటూరు జిల్లా తాడికొండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Arun Chilukuri
Published on: 27 Aug 2022 2:59 PM IST
Internal Clashes in YSR Congress Party Tadikonda
X

తాడికొండలో ఉద్రిక్తత.. ఎమ్యెల్యే శ్రీదేవి వర్గం- డొక్కా వర్గం పోటాపోటీ నిరసనలు

Tadikonda: గుంటూరు జిల్లా తాడికొండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్యెల్యే శ్రీదేవి వర్గం- డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గం పోటాపోటీ నిరసనలు చేపట్టారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేస్తున్నారు. డొక్కా గో బ్యాక్ అంటూ ఎమ్యెల్యే వర్గం... ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా డొక్కా వర్గీయుల పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల మోహరింపుతో అప్రమత్తమైన పోలీసులు రంగ ప్రవేశం చేసి చర్చలు జరిపారు. తాడికొండలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప.. ఇలా రోడ్కెక్కకూడదని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story