Anakapalli: విహారయాత్రలో విషాదం.. అనకాపల్లి జిల్లా శారదానదిలో విద్యార్ధి గల్లంతు

Anakapalli: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా తుమ్మపాల సమీపంలోని శారదానదిలో స్నానానికి దిగి ఇంటర్‌ విద్యార్ధి గల్లంతయ్యారు.

Arun Chilukuri
Published on: 24 Nov 2025 11:14 AM IST
Anakapalli: విహారయాత్రలో విషాదం.. అనకాపల్లి జిల్లా శారదానదిలో విద్యార్ధి గల్లంతు
X

Anakapalli: విహారయాత్రలో విషాదం.. అనకాపల్లి జిల్లా శారదానదిలో విద్యార్ధి గల్లంతు

Anakapalli: విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా తుమ్మపాల సమీపంలోని శారదానదిలో స్నానానికి దిగి ఇంటర్‌ విద్యార్ధి గల్లంతయ్యారు. విశాఖ NADలోని శ్రీ చైతన్య కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు, నిన్న బోజ్జన్న కొండకు పిక్నిక్ వె‎ళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు పక్కనే ఉన్న శారదా నదిలో స్నానానికి దిగారు. వారిలో సాయి తనుజ్ అనే విద్యార్థి ఒక్కసారిగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, NDRF బృందాల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడటంతో రాత్రి గాలింపు నిలిపివేశారు. ప్రస్తుతం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విద్యార్థి తనుజ్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story