Kadapa: పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి

Murder Attempt on Inter Student: కడప జిల్లా బద్వేల్‌లో పెట్రోల్‌ దాడికి గురైన ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Oct 2024 7:35 AM IST
Inter Student Killed in Petrol Attack
X

Kadapa: పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి

Murder Attempt on Inter Student: కడప జిల్లా బద్వేల్‌లో పెట్రోల్‌ దాడికి గురైన ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందింది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. నిన్న విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు విచారణ జరుపుతున్నారు.

కాగా బద్వేలు రామాంజనేయనగర్‌కు చెందిన విద్యార్థిని, విగ్నేశ్ చిన్నపటి నుంచి స్నేహితులు. ఈ క్రమంలోనే తనతో మాట్లాడాలని, రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి రావాలని, లేనిపక్షంలో చచ్చిపోతానని విగ్నేశ్ బెదిరించడంతో విద్యార్థినిని అక్కడికి వెళ్లింది. దీంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను విద్యార్థినిపై పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి విగ్నేశ్ పారిపోయాడు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story