Insider Trading in Amaravati: మాజీ సిఎం చంద్రబాబు కి సీఐడి నోటీసులు

చంద్రబాబు నాయుడు:(ది హన్స్ ఇండియా)
Insider Trading in Amaravati: మాజీ సిఎం చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Insider Trading in Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో పెద్ద ఎత్తున్న భూకుంభకోణానికి తెర తీశారని తెలుగుదేశం అధినేత,నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకు రెండు బృందాలుగా హైదరాబాద్ వచ్చిన సీఐడీ అధికారులు జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు రాజధానిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించి నోటీసులు అందజేసినట్లు సమాచారం. తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చంద్రబాబుతో పాటు మరో కీలక నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా 41 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.మార్చి 23న తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చారు. రాజధాని భూముల కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా చంద్రబాబు వ్యవహరించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు సహా మాజీ మంత్రి పి నారాయణ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఐపీసీ సెక్షన్ 120బీ, 166,167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సీఐడీ కేసు నమోదుచేసింది. అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. రాజధాని భూ కుంభకోణం కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. 2016లో రాజధాని ప్రాంతంలోని రావెల గోపాల కృష్ణ అనే వ్యక్తికి ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి.
చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
శివసేన నేత సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు
28 Jun 2022 2:26 AM GMTకరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMTVisakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
28 Jun 2022 1:16 AM GMTఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
28 Jun 2022 1:02 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMT