Gudivada: సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించడంపై తీవ్ర విమర్శలు

Gudivada: టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడలో క్యాసినో గేమ్స్‌పై విచారణ

Rama Rao
Published on: 19 Jan 2022 11:42 AM IST
Inquiry into Casino Games in Gudivada Following a Complaint by TDP Leaders
X

క్యాసినో గేమ్స్‌పై విచారించి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశం

Gudivada: సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో తరహా జూదాలను నిర్వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో క్యాసినో గేమ్స్‌పై విచారణ చేసేందుకు ప్రత్యేక అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులను కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నియమించారు. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెక్షన్‌ సెంటర్‌లో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకుల పర్యవేక్షణలో జూదం నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దాదాపు 500 కోట్ల మేర జూదం నిర్వహించారని, ఇతర అసాంఘిక చర్యలకు తెరతీశారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు సోమవారం జిల్లా ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులను నియమించి క్యాసినో గేమ్స్‌పై విచారించి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు.

Rama Rao

Rama Rao

Next Story