Nellore: యువతిపై విచక్షణారహితంగా దాడి.. శారీరక వాంఛ తీర్చాలంటూ వేధింపులు

* రక్తం వచ్చేలా యువతిపై దాడి చేసిన వైనం * వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన కామాంధులు

Sandeep Reddy
Published on: 15 Sept 2021 8:58 AM IST
Indiscriminate Attack on Young Woman to Keep physical Relationship With Another Men
X

యువతిపై విచక్షణారహితంగా దాడి

Nellore: ఆధునిక యుగంలోనూ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హత్యలు, అత్యాచార ఘటనలు, లైంగిక దాడులు, పైశాచిక దాడులు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరులోని రామకోటయ్య నగర్ సమీపంలో ఓ యువతిపై విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. తన పక్కన ఉన్న మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ యువతిని కర్రతో చితకబాదాడు. తనను కొట్టొద్దని వేడుకుంటున్నా ఆ దుర్మార్గుడు మరింత రెచ్చిపోయాడు. ఆపై వీడియోను సోషల్ మీడియాతో పెట్టి వైరల్ చేశారు. దీనిపై నెటిజన్లు, ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story