వైజాగ్‌ - బెంగళూరు మధ్య ఇండిగో విమాన సర్వీసు

Sumitra
Published on: 30 Nov 2019 8:30 PM IST
వైజాగ్‌ - బెంగళూరు మధ్య ఇండిగో విమాన సర్వీసు
X

విశాఖపట్నం ప్రజలు ఇప్పటి వరకూ బెంగుళూరు వెళ్లాలంటే బస్సుల్లోనో, రైళ్లలోనో ప్రయాణించే వారు. కానీ ఇక మీదట విమానంలో కూడా బెంగుళూరు వెళ్లే అవకాశం కల్పించింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ. విశాఖపట్నం నుంచి బెంగుళూరు వెళ్లాలను కునే ప్రయాణికుల కోసం ఇండిగో ఎయిర్ లైన్స్ నూతనంగా విమాన సర్వీసులను ఆదివారం నుంచి ప్రారంభించనుంది.

ఈ విమానం బెంగళూరులో ఉదయం 05.35 కి బయలుదేరి 07.05కి విశాఖకు చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్టణంలో ఉదయం 07.45కి బయలుదేరి 09.35 కి బెంగళూరు చేరుకుంటుందని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికార వర్గాలు తెలిపాయి. ఇక మీదట ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా హ్యాపీగా జర్నీని కొనసాగించవచ్చు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.




Sumitra

Sumitra

Next Story