Australia: అస్ట్రేలియాలో విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి తెలుగు డాక్టర్ మృతి

Australia: ఉంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు

Shekhar G
Published on: 9 March 2024 10:23 AM IST
Indian Woman Doctor Dies in Australia
X

Australia: అస్ట్రేలియాలో విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి తెలుగు డాక్టర్ మృతి

Australia: ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తూ కాలు జారడంతో కింద పడి మృతి చెందింది. కృష్ణా జిల్లాకు చెందిన ఉజ్వల ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. స్నేహితులతో కలిసి ఈనెల 2న ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళుతుందనుకున్న ఉజ్వల ఇలా ఊహించని విధంగా దూరమవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నేడు ఉజ్వల స్వగ్రామం ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అంత్యక్రియలు జరగనున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story