Sirisha Bandla: అంతరిక్షంలోకి తొలి తెలుగు తేజం

Indian-American Sirisha Bandla All Set To Fly To Space
x

Sirisha Bandla: అంతరిక్షంలోకి తొలి తెలుగు తేజం

Highlights

Sirisha Bandla: అంతరిక్ష పరిశోధనల్లో భారత సంతతి యువతి అరుదైన ఘనత సొంతం చేసుకోబోతుంది.

Sirisha Bandla: అంతరిక్ష పరిశోధనల్లో భారత సంతతి యువతి అరుదైన ఘనత సొంతం చేసుకోబోతుంది. అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ స్పేష్ షిప్ ద్వారా గుంటూరుకు చెందిన శిరీష బండ్ల స్పేస్ టూర్‌కు రెడీ అవుతోంది. కల్పనా చావ్లా, ఇండియన్‌ అమెరికన్‌ సునీతా విలయమ్స్‌ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళగా రికార్డు సృష్టించబోతోంది. అలాగే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు తేజం రెండవ భారతీయ మహిళ, నాల్గవ భారతీయురాలిగా కూడా సరికొత్త రికార్డులను అందుకోబోతోంది.

యూఎస్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ వ్యోగనౌకను నింగిలోకి పంపనుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు మొత్తం ఐదుగురు ప్రయాణించనున్నారు. వీరిలో సంస్థ ఉపాధ్యక్షురాలు శిరీష కూడా చోటు దక్కించుకోవడం సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ నెల 11న సాయంత్రం న్యూ మెక్సికో నుంచి ఈ స్పేస్ జర్నీ ప్రారంభం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories