Cricket Betting - Andhra Pradesh: ఏపీలో జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌

Cricket Betting - Andhra Pradesh: వికెట్టు వికెట్టుకు‌, ఫోర్‌, సిక్సర్‌కి ముందుగానే జాతకాలు రాస్తున్న బుకీలు...

Shireesha
Updated on: 24 Oct 2021 9:45 AM IST
India vs Pakistan Match Betting Started in Andhra Pradesh | Cricket News Today
X

Cricket Betting - Andhra Pradesh: ఏపీలో జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌

Cricket Betting - Andhra Pradesh: దాదాపు 28 నెలల తర్వాత ఇవాళ ఇండియా-పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. దీంతో ఏపీలో జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌ ప్రారంభమైంది. ఇండియా, పాక్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌లు మొదలైనట్లు తెలుస్తోంది. వికెట్టు వికెట్టుకు, ఫోర్‌, సిక్సర్‌కి ఎంత డబ్బు నిర్ణయించాలో అనే జాతకాలను ముందుగానే రాస్తున్నారు బుకీలు. పాక్‌పై ఇండియా గెలిస్తే వెయ్యికి రెండువేల రూపాయలు.. ఇండియాపై పాక్‌ గెలిస్తే వెయ్యికి 1300 రూపాయలను కొందరు బుకీలు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు బెట్టింగ్‌ స్టార్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఇవాళ మ్యాచ్‌ ఉండటంతో బెట్టింగ్‌ మాఫియాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

Shireesha

Shireesha

Next Story