Cm Jagan: భవిష్యత్తులో ఏపీ నుంచి ఒక ఐపీఎల్‌ టీం..

Cm Jagan: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం జగన్ సమీక్ష

Dhatripriya
Published on: 15 Jun 2023 5:26 PM IST
In Future An IPL Team From Andhra Pradesh
X

Cm Jagan: భవిష్యత్తులో ఏపీ నుంచి ఒక ఐపీఎల్‌ టీం..

Cm Jagan: ''ఆడుదాం ఆంధ్ర'' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించనున్నారు. గ్రామ,వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు ఉంటాయి. మొత్తం 46 రోజుల పాటు ఆటల పోటీలు జరుగుతాయి. క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ప్రతిఏటా ఈ ఆటల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. క్రికెట్‌ లాంటి ఆటలో సీఎస్‌కె మార్గదర్శకం చేస్తుందని... నిర్వహణలో పాల్గొంటారని తెలిపారు.

చెన్నై సూపర్‌కింగ్స్‌కు 3 క్రికెట్‌ స్టేడియాల్లో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తామన్నారు. భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్‌ టీం దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ఆడేవారికి క్రీడా సామగ్రిని అందించాలని ఆదేశించారు. ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతో పాటు..కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను అందించాలని జగన్ పేర్కొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story