ఏ కోడి గెలుస్తుంది... ఏ ఘడియల్లో గెలుస్తుంది?: పందెంరాయుళ్లు ఆధారపడేది ఈ గ్రంథంపైనే!!

in andhra pradesh cockfighting like Astrological science named Kukkuta Sastram here is the story
x
Highlights

కోడి పందేలకు పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి సరే... మరి కోట్లు పోసి కాసే పందెంలో విజయం సాధించడం ఎలా..? పుంజుకి సత్తా ఉంటే సరిపోతుందా..? గ్రహాలు కూడా...

కోడి పందేలకు పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి సరే... మరి కోట్లు పోసి కాసే పందెంలో విజయం సాధించడం ఎలా..? పుంజుకి సత్తా ఉంటే సరిపోతుందా..? గ్రహాలు కూడా అనుకూలించాలా ఈ విషయం తెలుసుకోవడానికి గోదావరి జిల్లాల్లో ఏకంగా ఓ గ్రంథమే అందుబాటులో ఉంది. అదే కుక్కుట శాస్త్రం అసలు కుక్కట శాస్ర్తం అంటే ఏంటి..? దానిపై పందెం రాయుళ్లకి ఎందుకంత గురి..? దాని కథాకమామిషు ఏంటో ఓ సారి చూద్దాం.

వారాలు.. తిథులు.. నక్షత్రాలు మనుషులకే కాదు కోళ్లకి ఉంటాయి ఏ జాతి కోడి ఎప్పుడు నెగ్గుతుంది..? ఎప్పుడు ఓడిపోతుంది...? ఏ నక్షత్రం దానికి కలిసి వస్తుంది ఏది కలసి రాదు..? ఇవన్నీ తెలిపే గ్రంథం ఒకటుంది. అదే కుక్కుట శాస్త్రం ఒక్క మాటలో చెప్పాలంటే కోళ్ల పంచాంగం గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు కోడి పందేల సమయంలో ఈ గ్రంథంపైనే ఆధారపడతారు.

ఈ కుక్కుట శాస్త్రం అంత్యంత పురాతనమైనది దీనిని శివుడు పార్వతీదేవికి ఉపదేశించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పక్షులు ముఖ్యంగా కోళ్ల భూత, వర్తమాన, భవిష్యత్‌ గురించి వాటి మరణశాసనాల గురించి ఈ కుక్కుట శాస్త్రంలో పొందుపరిచారు. కోడి జాతి లక్షణాలకి అనుగుణంగా వాటిని నెమలి, కాకి, డేగ, గూబ, కోడిగా పేరు పెట్టారు. ఏ వారంలో ఏ కోడి గెలుస్తుంది..? ఏ ఘడియల్లో ఏ నక్షత్రంలో దానికి యుద్ధరంగంలో దించాలనేది ఈ కుక్కుట శాస్త్రంలో వివరంగా రాసి ఉంది.

కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం కోళ్ల పందేలు జరిగే ప్రాంతం పందెం రోజున ఉండే నక్షత్రాన్ని బట్టి ఏ జాతి కోడిని రంగంలోకి దింపాలో ఆ గ్రంథం చెబుతుంది. అంతేకాదు కొన్ని జాతి కోళ్లు కృష్ణ పక్షంలో నెగ్గితే, మరికొన్ని కోళ్లు శుక్ల పక్షంలో మాత్రమే నెగ్గుతాయని కుక్కుట శాస్త్రం చెబుతోంది. ఈ గ్రంథం ప్రకారం వెళితే కోడి పందెంలో విజయం ఖాయమని పందెం రాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో నక్షత్రం ఒక్కో జాతి కోడిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ నక్షత్ర ప్రభావం వల్ల వాటి బలం పెరుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఈ గ్రంథాన్ని అనుసరించే వాళ్లు చాలాసార్లు కోడి పందేలలో విజయం సాధించడంతో కుక్కుట శాస్త్రంపై పందెం రాయుళ్లకి బాగా నమ్మకం పెరిగింది. కోట్ల రూపాయల్లో కాసే పందెంలో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే తప్పులేదనే అభిప్రాయమూ ఉంది.

సంక్రాంతి అంటే ఒక్కరోజులో హడావిడిగా జరిగిపోయే పండగ కాదు. మూడ్రోజుల మురిపెం అంత కన్నా కాదు. రావటానికి నెల, పోవటానికి నెల సమయం తీసుకునే పండగ. ఆ కాలమంతా తన జ్ఞాపకాలను, సన్నాహాలను ఒక వ్యాపకంగా మార్చేసే పండగ. ధనుర్మాసంతోనే సంక్రాంతి ఆనవాళ్లు కళ్ల ముందు కదలాడుతాయి. యుద్ధానికి సన్నద్ధమయ్యే సంతోషంతో పందెంరాయుళ్లు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. ఏడాది పాటు చేసిన సన్నాహాలకు ఆఖరి వ్యూహాలు రచిస్తూ వుంటారు. సంక్రాంతి రోజుల్లో కోడిపుంజులతోనే వాళ్ల స్నేహం. కోడిపందాలే వాళ్ల సరదా. అది కొందరికి విషాదం ఇంకొందరికి వినోదం.

Show Full Article
Print Article
Next Story
More Stories