Yanamala Rama Krishnudu: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్టికల్ 19ని అడ్డుకునే చట్టమే లేదు

In A Democratic System There Is No Law To Prevent Article 19
x

Yanamala Rama Krishnudu: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్టికల్ 19ని అడ్డుకునే చట్టమే లేదు

Highlights

Yanamala Rama Krishnudu: రాష్ట్రపతి అనుమతి లేకుండా చట్టాలను మారుస్తున్నారు

Yanamala Rama Krishnudu: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని పాలకులను ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందని టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఆర్టికల్‌ 19ని అడ్డుకునే చట్టమే లేదని రాష్ట్రపతి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా చట్టాలను మారుస్తున్నారని అన్నారు. బ్రిటీష్ కాలం నాటి యాక్ట్‌ 1861 ఉపయోగించి అర్ధరాత్రి చీకటి జీవో నెం.1ని జారీ చెయ్యడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సెక్షన్‌ 144, సెక్షన్‌ 30లను నిరంతరం అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్, తుగ్లక్, గోబెల్స్ లకు ప్రతిరూపం జగన్మోహన్‌ రెడ్డి పాలన అని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories