Chandrababu Naidu: రాజకీయ అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu: వైసీపీ చేసిన అరాచకాలపై కోపం, కసి ఉన్నా చట్టపరంగానే వెళ్దాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Aug 2024 9:46 PM IST
Important comments of Chandrababu on politics
X

Chandrababu Naidu: రాజకీయ అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu: మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వైసిపి చేసిన అరాచకాలపై కోపం, కసి ఉన్నా చట్టపరంగానే వెళ్దాం అన్నారు చంద్రబాబు. అక్రమ కేసుల్లో అరెస్టై జైలుకెళ్లిన బాధితుల్లో తానూ ఉన్నానని గుర్తించాలన్నారు. ఏపీ ఎన్నికల్లో జరిగింది నిశబ్ద విప్లవమైతే, బంగ్లాదేశ్ లో వైలెంట్ విప్లవం చూశాం. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఓటు రూపంలో ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.

నియోజకవర్గాల అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల మధ్యే చర్చ పెట్టి, వారి అభిప్రాయాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని నేతలకు చంద్రబాబు హితబోధ చేశారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని, జగన్ చేస్తున్న ఆందోళన, తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రులు ఎందుకు స్పందించట్లేదో అర్థమవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story