Weather Report: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

Weather Report: సోమవారం చెన్నై, మచిలీపట్నం మధ్యతీరం దాటే అవకాశం

Jyothi
Published on: 1 Dec 2023 12:32 PM IST
IMD Rains Forecast In Andhra Pradesh Districts
X

Weather Report: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు 

Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారబోతోంది. ఎల్లుండి తుఫాన్ గా మారే అవకాశముంది. సోమవారం సాయంత్రం చెన్నై, మచిలీపట్నం మధ్య తీవ్రం దాటే అవకాశముంది. దీని ప్రభావం వల్ల ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story