Rainfall Alert: ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలు

Rainfall Alert: విజయవాడలో వరదలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Sept 2024 10:34 AM IST
IMD issues fresh rainfall alert to Andhra Pradesh
X

Rainfall Alert: ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలు

Rainfall Alert: విజయవాడలో వరదలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఉత్తర కోస్తాలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర మీదుగా అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణశాఖ తెలిపింది.

ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు అల్లూరి, విశాఖ, ఉభయగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story