విశాఖలో పెట్రేగిపోతున్న ఇసుకాసురులు

విశాఖలో పెట్రేగిపోతున్న ఇసుకాసురులు
x
Highlights

ప్రభుత్వమిచ్చిన ఇసుక 'బల్క్‌ బుకింగ్‌' వెసులుబాటు కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఎక్కువ మొత్తంలో బుక్‌ చేయటం దాన్ని పక్కదారి పట్టించటం సొమ్ము...

ప్రభుత్వమిచ్చిన ఇసుక 'బల్క్‌ బుకింగ్‌' వెసులుబాటు కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఎక్కువ మొత్తంలో బుక్‌ చేయటం దాన్ని పక్కదారి పట్టించటం సొమ్ము చేసుకోవటంలో అక్రమార్కులు ఆరితేరిపోయారు. ఇసుకకు ఉన్న డిమాండ్ ను అదునుగా చేసుకుని అడ్డదారుల్లో సొమ్ము చేసుకుంటున్న ఘనుల ఆట కట్టించారు పోలీసులు.

విశాఖ మహానగరంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతుంటాయి. రియల్ ఎస్టేట్ తో పాటుగా గృహ నిర్మాణాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. దీంతో ఇసుకకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. రకరకాల ఆరోపణలు కారణంతో ప్రభుత్వం ఇసుక సరఫరా విధానంలో సంస్కరణలు తీసుకువచ్చి సమూలమైన మార్పులు చేసింది. అందులో భాగంగా బల్క్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక వ్యక్తి ఒకేసారి అవసరమైన మొత్తం ఇసుకను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

అయితే ప్రభుత్వం పెట్టిన బల్క్ బుకింగ్ ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు కొందరు కేటుగాళ్లు. నకిలీ వర్క్ ఆర్డర్లు సృష్టిస్తున్నారు. ఒక అడ్రస్ పేరిట ఇసుక బుక్ చేయడం, మరో అడ్రస్ కు దానిని చేర వేయడం ద్వారా కొందరు మాయగాళ్లు లక్షలాది రూపాయలను అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. చాలాకాలంగా సాగుతున్న ఈ దందాపై పోలీసులకు అనుమానం రావడంతో నిఘా పెట్టి పలు ముఠాల గుట్టు రట్టు చేసారు.

పెందుర్తి, ఆగనంపూడి టోల్ గేటు వద్ద వేర్వేరుగా అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పోలీసులు పట్టుకున్నారు. బుక్ చేసేటప్పుడు ఒక అడ్రాసు చెప్పి వందల కొద్ది టన్నుల ఇసుకను మరో చోటుకు తరలిస్తున్నారు. దీనికి జీవీఎంసీ కమిషర్, జేసీలు ఆన్ లైన్ లో ధృవీకరించినట్లు ఓ నకిలీ వర్క్ ఆర్డర్ ను పొందుపరిచారు. దీనిపై సదరు అధికారులను పోలీసులు విచారించగా మోసగాళ్ల బండారం బయటపడింది.

మరోవైపు ఇసుకకు ఉన్న డిమాండ్ ను సొమ్మేు చేసుకోవాలని రీచ్ ఇసుకలో సముద్రపు ఇసుక కలిపి విక్రయిస్తున్నారు. దీంతో నిర్మాణాలు బలహీనపడతాయి. ఈ క్రమంలో తిక్కవానిపాలెంలో సముద్రపు ఇసుక దిబ్బలను తవ్వుతుండగా ఆరు లారీలు స్వాధీనం పరుచుకోవడంతో పాటు పదిమందికి అరెస్ట్ చేసారు పోలీసులు. ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వాలు ఎన్నో వెసులుబాట్లను సమకూరుస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకొన్న కొందరు అక్రమార్కుల వల్ల సామాన్యులు అవస్తలు పడుతున్నారు. అందుబాటు ధరలో దొరకాల్సిన ఇసుకను ఎక్కువ రుసుము చెల్లించి కొనాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories