Vijayawada: సర్కారు బడిలో ఐఏఎస్‌ పిల్లలు

Vijayawada: ఏపీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Arun Chilukuri
Published on: 6 July 2022 3:56 PM IST
IAS Officers Children Joins Patamata Zilla Parishad School
X

Vijayawada: సర్కారు బడిలో ఐఏఎస్‌ పిల్లలు

Vijayawada: ఏపీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) వీసీ, ఎండీ ఎన్. ప్రభాకర్‌రెడ్డి తన ఇద్దరు పిల్లలను నిన్న విజయవాడలోని పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్‌ చేశామని ప్రభాకర్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్కూల్‌లో వసతులు, క్లాస్‌రూమ్‌లు, ప్లే గ్రౌండ్‌ అన్నీ చాలా బాగున్నాయన్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కూడా వాళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story