Vishal: కుప్పంలో చంద్రబాబు పై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ !

Vishal: చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.

Jyothi
Published on: 2 July 2022 10:19 AM IST
I Have Been Hearing Rumours About My Entry Into Politics In Andhra Pradesh And Contesting In Kuppam Constituency
X

Vishal: కుప్పంలో చంద్రబాబు పై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ !

Vishal: టీడీపీ అధినేత చంద్రబాబు పై కుప్పం నియోజక వర్గం‌ నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ విషయం‌ ట్రెండింగ్ గా మారటంతో.. ఈ రూమర్స్‌పై విశాల్ స్పందించారు. తాను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తున్నానని.. కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాననే ప్రచారం జరుగుతోందని.. వాటన్నింటినీ ఖండిస్తున్నాను అన్నారు. రాజకీయాలకు సంబంధించి తాను ఇప్పటివరకూ ఎవరిని కలవలేదని.. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియటం లేదన్నారు. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నానని.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని, చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.

Jyothi

Jyothi

Next Story