Chandrababu: వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం

Chandrababu: జగన్ పెన్షన్ల డ్రామా ఆడుతున్నారు

Shashank Gullapelli
Published on: 3 April 2024 7:56 PM IST
I am Against Politicizing Volunteers Says Chandrababu Naidu
X

Chandrababu: వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం

Chandrababu: APలో పెన్షన్ పేరుతో వైసీపీ సర్కార్ రాజకీయ డ్రామాలు ఆడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, రామచంద్రాపురంలో ఆయన ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. మద్యపానం నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్... మద్యాన్ని నిషేధించకపోగా... నకిలీ మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. అది తాగి అనేక మంది చనిపోతోందని, యువత నిర్వీర్యమవుతోందని చంద్రబాబు ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. వాలంటీర్లు 50 వేలు సంపాదించే మార్గం చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే వాలంటీర్లు రాజకీయం చేయడానికి తాను వ్యతిరేకమన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం జగన్ కొత్త డ్రామా ఆడుతున్నారని, పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story