జర్నలిస్టులపై దాడుల నివారణకు త్వరలో హైపర్ కమిటీ

జర్నలిస్టులపై దాడుల నివారణకు త్వరలో హైపర్ కమిటీ
x
Highlights

జర్నలిస్టులపై దాడుల నివారణకు వీలుగా రాష్ట్రస్థాయిలో హైపర్ కమిటీని వీలైనంత త్వరలో నియామకం చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధి వర్గానికి హామీ ఇచ్చారు.

అమరావతి: జర్నలిస్టులపై దాడుల నివారణకు వీలుగా రాష్ట్రస్థాయిలో హైపర్ కమిటీని వీలైనంత త్వరలో నియామకం చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధి వర్గానికి హామీ ఇచ్చారు. సచివాలయంలో ఈరోజు హోం మంత్రిని కలిసిన ఫెడరేషన్ ప్రతినిధి వర్గం జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు రాష్ట్రస్థాయిలో హైపర్ కమిటీ, జిల్లా స్థాయిలో దాడుల నివారణ కమిటీలను నియమించాలని కోరింది. అందుకు వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, వాటిని తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ, కమిటీ నియామకానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఓఎస్ డి అనిల్ కుమార్ ని ఆదేశించారు. మంత్రిని కలిసిన ఫెడరేషన్ ప్రతినిధి వర్గంలో ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలిమిశ్రీ,, ఎంబీ నాథన్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఆనంద్, చిన్న పత్రికల సంఘం నాయకులు హుస్సేన్ ఖాన్ తదితరులు ఉన్నారు. అనంతరం, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను హోంశాఖా మంత్రి వంగలపూడి అనితకు వివరించినట్లు తెలిపారు. హైపర్ కమిటీని నియమించి, తగిన చర్యలు తీసుకుంటే, జర్నలిస్టులపై జరిగే దాడులు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే హైపర్ కమిటీని నియమిస్తామని చెప్పారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories