Tirupati: టిక్‌టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య

Tiktok Love: టిక్‌టాక్‌లో ఏర్పడిన ప్రేమ వ్యవహారంలో ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేయడం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో చర్చనీయాంశమైంది.

Arun Chilukuri
Published on: 22 Sept 2022 1:26 PM IST
Tirupati: టిక్‌టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య
X

Tirupati: టిక్‌టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య

Tiktok Love: టిక్‌టాక్‌లో ఏర్పడిన ప్రేమ వ్యవహారంలో ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేయడం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో చర్చనీయాంశమైంది. అంబేడ్కర్ నగర్ కి చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉంటూ టిక్ టాక్ లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అలా అతడికి విశాఖపట్నంకి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కొన్నాళ్లు చనువుగా ఉన్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ ఆ అబ్బాయి ఆమె నుంచి దూరమయ్యాడు.

అనంతరం అతనికి టిక్‌టాక్‌లోనే కడపకు చెందిన మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత ఆ అబ్బాయి మొదటి ప్రియురాలు, అదే విశాఖకు చెందిన అమ్మాయి మళ్లీ తిరిగొచ్చింది. ఐతే అప్పటికే అతనికి పెళ్లయిందని తెలుసుకుని, వెనుదిరిగి వెళ్లకుండా యువకుడి భార్యతో మాట్లాడి, అతనిని ప్రేమించానని, అందరం కలిసి ఇదే ఇంట్లో ఉందామని చెప్పడంతో అతని భార్య మొదట కంగారు పడినా చివరకు అంగీకరించింది. దీంతో భర్తను, భర్త ప్రియురాలిని స్వయంగా అలంకరించి, ఇద్దరికీ వివాహం జరిపించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story