Andhra Pradesh: విజయవాడ టైమ్‌ హాస్పిటల్‌కు భారీ జరిమానా

Andhra Pradesh: రూ.5 లక్షలు ఫైన్‌ విధించిన అధికారులు * ఏపీ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

Sandeep Eggoju
Published on: 6 Jun 2021 3:09 PM IST
Huge Fine To Vijayawada Time Hospital  Andhra Pradesh
X

విజయవాడలోని టైం హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: విజయవాడ టైమ్‌ హాస్పిటల్‌కు భారీ జరిమానా విధించారు అధికారులు. కోవిడ్ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, కరోనా పేషెంట్‌ నుంచి 2 లక్షలు డిమాండ్‌ చేసింది ఆస్పత్రి యాజమాన్యం. దీంతో.. బాధిత కుటుంబం 50వేలు చెల్లించగా.. మరో లక్షన్నర ఇవ్వాలంటూ పట్టు బట్టింది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అధికారులు.. ఆరోగ్యశ్రీ కింద బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి, వారు కట్టిన 50వేలు తిరిగి ఇప్పించారు. ఇక.. నిబంధనలు ఉల్లంఘించిన టైమ్‌ ఆస్పత్రిపై కేసు నమోదు చేసి, 5 లక్షలు జరిమానా విధించారు అధికారులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story