శ్రీ శైలంలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 4గంటల సమయం

Srisailam: పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు

Jyothi
Published on: 20 Nov 2023 11:44 AM IST
Huge Devotees Rush At Srisailam Temple
X

శ్రీ శైలంలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 4గంటల సమయం

Srisailam: శ్రీశైలంలో కార్తీక సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story