తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

Tirumala: తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.

Arun Chilukuri
Published on: 14 Jun 2024 9:40 AM IST
Huge Devotees Rush At Sri Venkateswara Temple In Tirumala
X

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం 

Tirumala: తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. కాగా 61 వేల 409 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా, శ్రీవారి హుండీకి 3 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది. సహజంగా శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఉచిత దర్శనంలో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనం కావాలంటే పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story