Andhra Pradesh: ఎన్నికల వేళ.. రూ.8 కోట్లు పట్టుబడిన నగదు

Andhra Pradesh: పైపుల లోడు లారీలో నగదు తరలిస్తుండగా స్వాధీనం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 May 2024 10:09 AM IST
Huge cash seized in NTR district
X

Andhra Pradesh: ఎన్నికల వేళ.. రూ.8 కోట్లు పట్టుబడిన నగదు

Andhra Pradesh: ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొనసాగుతుండడంతో పలుచోట్ల కరెన్సీ భారీగా పట్టుబడుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 8 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తోన్న పైపుల లోడు లారీలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story