ఏలూరు జిల్లాలో రూ.50 లక్షల డబ్బు పట్టివేత

Eluru: జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం వద్ద తనిఖీలు

Jyothi
Published on: 7 Jan 2024 6:01 PM IST
Huge Cash Seized in Eluru
X

ఏలూరు జిల్లాలో రూ.50 లక్షల డబ్బు పట్టివేత

Eluru: ఏలూరు జిల్లాలో భారీగా డబ్బు పట్టుబడింది. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి రశీదులు లేకుండా తరలిస్తున్న 50 లక్షలను జీలుగుమిల్లి పోలీసులు సీజ్‌ చేశారు. ఆంధ్రా-తెలంగాణ అంతర్‌రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లి నుంచి రావులపాలెంకు కారులో డబ్బును తరలిస్తుండగా.. పోలీసులు నగదును సీజ్‌ చేశారు. పట్టుబడ్డ నగదును వీఆర్‌వోల సమక్షంలో లెక్కింది.. ఐటీ కార్యాలయానికి తరలించనున్నట్టు సీఐ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story