అయ్యో పాపం..అనారోగ్యంతో ఉన్న ఆమెకు పార్కే దిక్కయింది!

అయ్యో పాపం..అనారోగ్యంతో ఉన్న ఆమెకు పార్కే దిక్కయింది!
x
Highlights

మానవత్వం మంట కలిసిందక్కడ. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఇంటికి తీసుకురానీయలేదు ఇంటి యజమాని. దాంతో పార్కులో తలదాల్చుకోవాల్సి వచ్చింది.

ప్రకాశం జిల్లా పామూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. సురేష్ అనే యువకుడు తల్లిదండ్రులతో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం తల్లి వెంకటలక్ష్మికి క్యాన్సర్ సోకింది. కుటుంబాన్ని పోషిస్తున్న సురేష్ ఆమెను పలు ఆసుపత్రుల్లో చూపించాడు. చికిత్స కోసం 4లక్షల వరకు ఖర్చు చేశాడు. ఆమె ఆరోగ్యం క్షీణించగా ఈనెల 18న పామూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.

తల్లిని ఇంటికి తీసుకువస్తుండగా ఇంటి యజమాని ఎదురొచ్చి ఆమెను తన ఇంటికి తీసుకురావద్దని సురేష్‌ను హెచ్చరించాడు. తల్లిని కొడుకు తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఉంచడం కుదరదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఓ వర్మీ కంపోస్టు కేంద్రంలో ఆ రాత్రి తలదాచుకున్నారు. మరుసటి రోజు ఉదయం సిబ్బంది వచ్చి వెళ్లిపోవాలన్నారు. దిక్కుతోచని స్థితిలో సురేష్ తల్లిని చేతులతో మోసుకుంటూ స్థానిక డీవీ పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ టెంట్ వేసుకుని ఉన్నారు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో పామూరు ఆపసుపత్రిలో చేర్చుకోవాలని వైద్యాధికారికి సూచించారు. సిబ్బంది వెంకటలక్ష‌్మీని చేర్చుకోగా చికిత్స పొందుతూ చనిపోయింది. స్నేహితులు, బంధువులు సహా ఎవరూ సాయం చేయలేదని... ఈ దుస్థితి ఎవరికి రాకూడదని సురేష్ బోరుమన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories