కర్నూలు జిల్లాలో పరువు హత్య

X
Highlights
కర్నూలు జిల్లాలో పరువు హత్య జరిగింది. ఆధోనిలో ఫిజియోథెరపీ వైద్యుడిని కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు....
Arun Chilukuri31 Dec 2020 2:40 PM GMT
కర్నూలు జిల్లాలో పరువు హత్య జరిగింది. ఆధోనిలో ఫిజియోథెరపీ వైద్యుడిని కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. బైక్‌పై వెళ్తున్న డాక్టర్ ఆదాం అస్మిత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి చంపారు. రెండు నెలల క్రితం మహేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్న ఆదాం విట్టాకిష్టప్పనగర్ లో నివాసముంటున్నారు. వేరే సామాజిక వర్గం కావడంతో మహేశ్వరి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో వీరిద్దరు హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన భర్తను తమ తల్లిదండ్రులే హత్య చేశారని మృతుడి భార్య మహేశ్వరి ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
Web Titlehonour killing in Kurnool district
Next Story