ఏపీలో సినిమా టికెట్ రేట్లపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి క్లారిటీ

Movie Ticket Rates: ఏపీలో సినిమా టికెట్ రేట్లపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 16 Dec 2021 6:02 PM IST
Home Secretary Clarity on Movie Ticket Rates in AP
X

ఏపీలో సినిమా టికెట్ రేట్లపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి క్లారిటీ

Movie Ticket Rates: ఏపీలో సినిమా టికెట్ రేట్లపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జీవో 35 అమల్లోనే ఉందన్నారు. జీవో 35పై హైకోర్టు తీర్పు పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని తీర్పు కాపీలో ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు జీవో 35పై హైకోర్టులో వేర్వేరుగా మూడు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మూడు పిటిషన్లను కలిపి ఒకేసారి విచారణ, తీర్పు వెలువరించనుంది. ఇక తెనాలిలో 4, చోడవరంలో 1 థియేటర్‌కు పాతపద్ధతిలో అనుమతి ఇవ్వగా ఉత్తరాంధ్ర, తూ.గో జిల్లాలోని 225 థియేటర్లకు హైకోర్టు తీర్పు వర్తిస్తుంది. ఈ థియేటర్లలో మాత్రమే జీవో 35ను సస్పెండ్ చేసింది ఏపీ హైకోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story