ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. నేను సైగ చేస్తే..

ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. నేను సైగ చేస్తే..
x
ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. నేను సైగ చేస్తే..
Highlights

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దని తాను సైగ చేస్తే పరిస్థితి ఏమయ్యేదని హెచ్చరించారు. చట్టంపై తనకు...

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దని తాను సైగ చేస్తే పరిస్థితి ఏమయ్యేదని హెచ్చరించారు. చట్టంపై తనకు గౌరవం ఉందన్న బాలకృష‌్ణ మంత్రులకు అవగాహన లేక అసెంబ్లీలో గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధి కళ్లెదుటేకనబడుతుందని రాష్ట్రంలో రివర్స్‌ పాలన సాగుతుందని విమర్శించారు. మండలిని తండ్రి పునరుద్దరిస్తే తనయుడు రద్దు చేశాడని ఫైరయ్యారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యమన్నారు.

నిన్న హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ తగిలింది. రాయలసీమ ద్రోహి అంటూ సీమలో హైకోర్టును వ్యతిరేకిస్తున్న బాలకృష్ణ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మాత్రమే ఎందుకు అభివృద్ధి కోరుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సంచలన వ్యాఖ‌్యలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories