దుర్గమ్మను దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

X
Highlights
కరోనా నుంచి యావత్ ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నానని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన...
Arun Chilukuri12 Jan 2021 6:22 AM GMT
కరోనా నుంచి యావత్ ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నానని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న దత్తత్రేయ బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దత్తాత్రేయకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గమ్మ ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను తెలుగు వారు కనుగొనటం గర్వించదగ్గ అంశంమన్నారు దత్తాత్రేయ. వివేకానంద స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన సక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం గవర్నర్‌కు ఆలయ ఈవో అందజేశారు.
Web TitleHimachal Pradesh governor Bandaru Dattatreya visits Vijayawada Durga temple
Next Story