కర్నూలు జిల్లా పులికొండలో ఉద్రిక్తత..

కర్నూలు జిల్లా పులికొండలో ఉద్రిక్తత..
x

కర్నూలు జిల్లా పులికొండలో ఉద్రిక్తత..

Highlights

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పులికొండ గ్రామంలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ సమయంలో వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య...

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పులికొండ గ్రామంలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ సమయంలో వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో గ్రామస్తులు తిరగబడి పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. మొదటి రౌండ్‌ నుంచి టీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉన్నాడని గెలుపు ఖాయమనుకున్న సమయంలో వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో గ్రామంలోని టిడిపి మద్దతుదారులు కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని తిరిగి కౌంటింగ్ చేయాలని కోరారు. కానీ, ఎన్నికల అధికారి మాత్రం దానికి ఒప్పుకోలేదు. దీంతో టిడిపి మద్దతుదారులు పోలింగ్ కేంద్రం ముందే నిరసనకు దిగారు. బ్యాలెట్ బాక్సులను వాహనాలలో పత్తికొండ కు తరలించే ప్రయత్నం చేయగా పోలీసులకు గ్రామస్తులకు తోపులాట జరిగింది.

టీడీపీ మద్దతుదారులు ఎంతకీ వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ జరుగుతుండగా బ్యాలెట్ బాక్స్ లను పోలీసులు పత్తికొండ కు తరలించారు. రీకౌంటింగ్ జరిపించాలని కోరిన టీడీపీ మద్దతుదారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పోలీసులపై గ్రామస్తులు తిరగబడి పోలీస్ వాహనాల పై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘర్షణలో ముగ్గురు గ్రామస్తులకు ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories