కృష్ణాజిల్లా ఎనికేపాడు పంచాయితీ దగ్గర ఉద్రిక్తత

*పంచాయితీ ముందు బైఠాయించి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఆందోళన *కోటేశ్వరరావు నామినేషన్ చెల్లదన్న అధికారులు *2018లో కోటేశ్వరరావు క్రిమినల్ కేసు ఉందంటున్న అధికారులు

Samba Siva Rao
Updated on: 1 Feb 2021 8:31 PM IST
కృష్ణాజిల్లా ఎనికేపాడు పంచాయితీ దగ్గర ఉద్రిక్తత
X

కృష్ణాజిల్లా ఎనికేపాడు పంచాయితీ ముందు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఆందోళన నిర్వహించారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్థి గోగం కోటేశ్వరరావు నామినేషన్ చెల్లదని అధికారులు చెప్పడంతో పంచాయితీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2018లో కోటేశ్వరరావుపై క్రిమినల్ కేసు ఉందని అధికారులు చెబుతుండగా.. తనపై ఎలాంటి కేసులూ లేవని రీప్రజెంటేషన్ ఇస్తుంటే అధికారులు తీసుకోవడం లేదని ధర్నాకు దిగారు. దీంతో ఎనికేపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story