Andhra Pradesh: ఆగని హింస.. పరస్పరం దాడులు చేసుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు

Andhra Pradesh: పోలింగ్ ముగిసి రెండ్రోజులవుతున్న ఆగని హింస

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2024 11:35 AM IST
High Tension Continues In Andhra Pradesh
X

Andhra Pradesh: ఆగని హింస.. పరస్పరం దాడులు చేసుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు

Andhra Pradesh: ఏపీ ఎన్నికల్లో చెలరేగిన హింస పోలింగ్ ముగిసి రెండ్రోజులైనా కూడా చల్లారడంలేదు. రాష్ట్రంలో ఇంకా హింసా వాతావరణం కనిపిస్తూనే ఉంది. తలలు పగిలినా, కాళ్లు విరిగినా దాడులు చేసుకునేందుకు వెనుకాడడంలేదు. బిహార్, యూపీలో అల్లర్లకు మించి ఏపీలోని నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు.

తాజాగా పల్నాడు జిల్లాలో మళ్లీ వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. మాచవరం మండలంలో వైసీపీ, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. మాచవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద కారు ఎక్కుతున్న తమపై టీడీపీ నాయకులు దాడి చేశారని దాడిలో తమ కారు ధ్వంసమైందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story